స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, వైకాపా, భాజపా అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ తన సొంత వారికి న్యాయం చేయలేదని.. ఇక రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రిలయన్స్ అధినేత అంబానీ సూచించిన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమనే ఆరోపణలతో రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన జగన్... ఇప్పుడు అదే అంబానీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడంలో అంతర్యం ఏంటని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించాలి: తులసిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా, తెదేపా, భాజపాలను ఓడించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ రిలయన్స్ అధినేత అంబానీ సూచించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించాలన్న తులసీరెడ్డి