ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొనసాగుతోన్న విచార‌ణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను అధికారులు నిన్న ప్రశ్నించారు. ఇవాళ మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొనసాగుతోన్న విచార‌ణ
వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొనసాగుతోన్న విచార‌ణ

By

Published : Jun 9, 2021, 10:56 AM IST

Updated : Jun 10, 2021, 6:20 AM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 12 మంది అనుమానితులను దిల్లీ కేంద్రంగా దాదాపు 2 నెలలు విచారించిన సీబీఐ..మలివిడతగా కడపలో విచారణ వేగవంతం చేస్తోంది. 2019 మార్చి 8 నుంచి ఏప్రిల్ 28 వరకూ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న, పీఏ కృష్ణారెడ్డి సహా 12 మందిని దిల్లీలోని లాడ్జీల్లో ఉంచుతూ వేర్వేరుగా సీబీఐ విచారించినట్టు సమాచారం. మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.

ఈ నెల 7 నుంచి కడపలో విచారణ మొదలుపెట్టిన అధికారులు.. దస్తగిరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ హిదాయతుల్లాను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజున హిదాయతుల్లా మృతదేహం ఫొటోలు తీశాడన్న కారణంతో ఆ కోణంలో విచారిస్తోంది. వీరిద్దరితో పాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌నూ విచారించింది. హత్యకు 15 రోజుల ముందు వివేకాతో ఫోన్‌లో మాట్లాడి, కలిసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. ఇవాళ మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Jun 10, 2021, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details