ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో కారు బోల్తా... వ్యక్తికి తీవ్రగాయాలు - one injured

కడప జిల్లా దువ్వూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్​ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రగాయలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

కడపలో కారు బోల్తా...వ్యక్తికి తీవ్రగాయాలు

By

Published : May 15, 2019, 9:57 AM IST

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడిన ఘటనలో తిరుపతికి చెందిన కాటంరెడ్డి రాజశేఖర్​రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తుండగా డివైడర్​ను ఢీకొని కారు బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన రాజశేఖర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details