ఓటు నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడానికి అవగాహన సదస్సులు, యూత్ క్లబ్ ల ద్వారా ప్రచారం చేశామని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. ఈ సారి దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓ వాహనం ఏర్పాటు చేశామన్నారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పారామిలటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులంతా తప్పనిసరిగా ఓటు వేయాలంటున్న కడప కలెక్టర్ హరికిరణ్ తో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.
ఎన్నికలకు సర్వం సిద్ధం.. అర్హులంతా ఓటేయాలి! - AP
ఈ నెల 11న జరిగే ఎన్నికలకు.. కడప జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్హులందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరికిరణ్ చెప్పారు.

cdp colletor