ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోయంబేడు మార్కెట్​కు వెళ్లొచ్చిన వారు గుర్తింపు - kadapa corona cases latest news

కడప జిల్లాలో కరోనా నియంత్రణకు  అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్​కు వెళ్లి తిరిగొచ్చిన కడప జిల్లా వాసులు 350 మందిని గుర్తించామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నట్లు వివరించారు.

cadapa
cadapa

By

Published : May 16, 2020, 2:52 PM IST

cadapa corona cases

చెన్నై కోయంబేడు మార్కెట్​కు వెళ్లి తిరిగొచ్చిన కడపజిల్లా వాసులు 350 మందిని గుర్తించామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇప్పటికే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. వెల్లడైన 120 నమూనాల ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. మిగిలిన ఫలితాలు రావల్సిఉంది.

రాష్ట్రంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతానికి చెందిన వారిని కడప రైల్వేస్టేషన్ నించి 1600 మందిని పంపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే వలస కూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి కావల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కడప డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటికే వేంపల్లె ప్రాంతం రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ గా మారిందని...103 పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం 38 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details