కడప జిల్లా పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయం మెట్ల పక్కనున్న కిటికీ నుంచి రెండు ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. కార్యాలయానికి భద్రతా సిబ్బంది లేకపోవడం వలనే ఈ చోరీ జరిగిందని ఎమ్మార్వో అన్నారు. ఈ ఘటనకు సంబంధించి తహసిల్దార్ చంద్రశేఖర్వర్మ పోరుమామిళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మార్వో కార్యాలయంలో 2 ల్యాప్టాప్లు చోరీ
కడప జిల్లా పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో దొంగతనం జరిగింది. కార్యాలయానికి భద్రతా సిబ్బంది లేకపోవడం గమనించిన అగంతకులు చోరీకి పాల్పడ్డారు. విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
ఎమ్మార్వో కార్యాలయంలో దొంగతనం...రెండు ల్యాప్టాప్లు చోరీ