చట్టసభల్లో చేసిన చట్టాలకే విలువ లేనపుడు.. తాను వాటిలో సభ్యుడిగా ఉండటం ఉపయోగం లేదనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి తేల్చి చెప్పారు. పాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మండలి ఛైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినా ఫలితం లేకపోయిందని అన్నారు.
ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకం - మూడు రాజధానులపై బీటెక్ రవి
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకమని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. చట్టసభల్లో చేసిన చట్టాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు.
బీటెక్ రవి