ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' ప్రారంభానికి ముందే కూలిన వంతెన'

అధికారులు-గుత్తేదార్ల నిర్లక్ష్యం కారణంగా కడప-రాయచోటి రహదారిలోని రైల్వే పై వంతెన నిర్మాణం పూర్తి కాకముందే కుంగిపోయింది. 83 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే పై వంతెన మరో 20 రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా... ఈ ఘటన జరగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

By

Published : Aug 14, 2019, 2:14 PM IST

bridge

' ప్రారంభానికి ముందే కూలిన వంతెన'

కడప-చిత్తూరు జాతీయ రహదారిలో కడప నుంచి రాయచోటికి వెళ్లే దారిలో83కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే పై వంతెన నిర్మాణంలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కడప-రాయచోటి రహదారిలో రైల్వే గేటు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వంతెన నిర్మాణం మంజూరు చేసింది.గత కొన్ని నెలలుగా పనులు వేగంగా సాగుతున్నాయి.మరో20రోజుల్లో పై వంతెన ప్రారంభించాలని అధికారులు భావించారు.అంతలోనే ఊటుకూరు వైపు15నుంచి30మీటర్ల వరకు వంతెన పైభాగం కుంగిపోయింది.

చిన్నపాటి వర్షానికే పైవంతెన ఇంటర్ లాకింగ్‌లు ఉబుకుతున్నాయని అధికారులు గుర్తించారు.వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.వంతెన కుంగిపోయిన ప్రదేశంలో మట్టిని జే.సీ.బీ సాయంతో పక్కకు తొలగిస్తున్నారు.క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.

40ఏళ్ల నుంచి రైల్వే పై వంతెన కోసం ఎదురుచూస్తున్న కడప వాసుల కల నెరవేరుతోందని సంబరపడేలోపు ఇలాంటి ఘటన జరగడం స్థానికులకు ఆగ్రహం కలిగించింది.ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు జరిగే సమయంలో వంతెన కూలితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

దేశాన్ని రక్షించే సోదరా.. నీకు రాఖీ రక్ష!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details