కడప కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన యమున అనే మహిళ వినూత్నంగా నిరసన చేశారు. రెవిన్యూ అధికారులకు లంచం ఇచ్చేందుకు డబ్బులు వేయండంటూ భిక్షాటనకు దిగారు. 12 ఏళ్ల క్రితం సొంత ఊరు నుంచి వచ్చి ఇప్పుడు కష్టపడి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. పది వేల రూపాయలు లంచం ఇవ్వలేదనే కారణంతో అధికారులు తన ఇల్లు కూల్చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలి ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడబెట్టి ఐదు లక్షల డబ్భై ఐదు వేల రూపాయలతో కట్టుకున్న ఇంటిని పడగొట్టారన్నారు. ఇలాంటి అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.