గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని కడప జిల్లా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ ఆరోపించారు. ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసిన వైకాపా నేతలు, ప్రభుత్వంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. రాజంపేటలో అంగన్వాడి కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలను వేధిస్తే సహించం - కడప జిల్లా రాజంపేట
అధికార పార్టీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని, వైకాపా నేతల ఆగడాలను సహించమని సీఐటీయూ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరించారు.
అంగన్వాడీ కార్యకర్తలను వేధిస్తే సహించబోమంటూ సీఐటీయూ స్పష్టం
TAGGED:
కడప జిల్లా రాజంపేట