కడప జిల్లా రాజంపేట ఎన్జీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు వేతనాలు సమయానికి అందకపోవడంతో వారి పరిస్థతి కష్టంగా మారిందని తెలిపారు. కొత్త ప్రభుత్వంలో ఆశ వర్కర్లకు కనీస వేతనం పది వేల రూపాయలకు పెంచారని, కానీ... దానికి సంబంధించిన జీవో మాత్రం విడుదల చేయలేదన్నారు.
"ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి" - సిఐటియు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజంపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆశ వర్కర్ల బకాయిలను వెంటనే చెల్లించండి