స్మార్ట్ ఫోన్ చూస్తూ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ - సెల్‌ఫోన్
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు... చాలా ఆర్టీసీ బస్సులపై రాసి ఉండే వాఖ్యం ఇది చెప్పడానికే కానీ తమకు వర్తించదనే రీతిలో ఉంది ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు.
స్మార్ట్ ఫోన్ చూస్తూ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం మీదుగా ప్రతి రోజు కడప, ప్రొద్దుటూరు వయా కోగటం మీదుగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి ఈ మార్గంలో ప్రతిరోజు విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇతర ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి దారిలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరవేయాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యం వహించారు. ఒక చేత్తో స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ మరొక చేత్తో డ్రైవింగ్ చేశారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.