కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో వెలసిన మారమ్మ అంకాలమ్మ జాతర వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళా సమాఖ్య భవన్ వద్ద అమ్మవార్ల ప్రతిమలను తయారుచేసి అక్కడినుంచి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన చలువ పందిరిలో ప్రతిష్టించజేశారు. అనంతరం భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.
వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర - రాజంపేట
మన్నూరులో మారమ్మ-అంకాలమ్మ జాతర మహోత్సవం సందడిగా జరిగింది. అమ్మవార్ల ప్రతిమలను మేళతాళాలతో వీధుల్లో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర