ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతీ ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం.. త్వరలో!' - Anandayya medicine distribute in Kamalapuram

త్వరలో ఆనందయ్య వారసులను పిలిపించి కరోనా నివారణ మందులు తయారు చేయించి తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తానని... కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. డబ్బాలో ఉన్న మందు పదిమందికి ఉపయోగపడే విధంగా ఉందని.. జాగ్రత్తగా ఉపయోగించి కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు.

ఆనందయ్య మందు పంపిణీ
ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jun 19, 2021, 5:48 PM IST

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఆనందయ్య కరోనా నివారణ మందును పంపిణీ చేశారు. అతి తక్కువ మందులు రావడంతో కొద్దిమందికే పంపిణీ చేస్తున్నామని, త్వరలో ఆనందయ్య వారసులను పిలిపించి కరోనా నివారణ మందులు తయారు చేయించి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించి నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబ్బాలో ఉన్న మందు పదిమందికి ఉపయోగపడే విధంగా ఉందని.. జాగ్రత్తగా మందులు ఉపయోగించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details