ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి ఉద్యమం చేస్తున్న వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే' - deputy cm taja news

అమరావతి ఉద్యమంపై ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు అసలు రైతులే కాదని విమర్శించారు. అలాగే రాజధాని అంశంపై తెదేపా తీరును ఆయన తప్పుపట్టారు.

amjad basha pressmeet oఅn amaravathi farmers
amjad basha pressmeet on amaravathi farmers

By

Published : Aug 23, 2020, 9:17 PM IST

అమరావతిలో ఉద్యమాలు చేస్తున్న వారందరూ రైతులు కాదని... రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని అన్నారు ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా. ఉద్యమం వెనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తం ఉందని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతుల ఆందోళన 250 రోజుకు చేరిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా తేదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టడం సమంజసంగా లేదని అంజద్ బాషా అన్నారు. నిజమైన రైతులు ఉద్యమాలు చేస్తుంటే పరిస్థితి ఈ విధంగా ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 15 నెలల్లోనే సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details