కరోనా సర్వే, కరోనా పరీక్షల నిర్వహణ కోసం ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఆరోగ్య కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ అధికారి వెంగల్రెడ్డి సూచించారు. 1979 పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎన్95 మాస్కులను వైద్యాధికారి ద్వారా అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్య కార్యకర్తలకు సాధారణ మాస్కులు అందించామని చెప్పారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఇప్పుడు ఎన్95 మాస్కులను అందించినట్లు తెలిపారు. నిరంతరం ప్రజలతో కలిసి పనిచేసే ఏఎన్ఎంలకు ఈ మాస్కులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు.
ఏఎన్ఎంలకు ఎన్95 మాస్కులు అందజేత - రాజంపేట వార్తలు
రాజంపేట 1979 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ప్రభుత్వ వైద్యాధికారి వెంగల్ రెడ్డి చేతుల మీదగా ఏఎన్ఎంలకు ఎన్95 మాస్కులను అందజేశారు. సర్యేకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
provided n95 masks to anms in kadapa