కడప జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆక్షేపించారు. సీకేదిన్నే మండలంలోని సర్వేనంబరు 618లో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా.. తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్థలం కబ్జాకు గురైందని దానిని కాపాడాలని తహసీల్దార్ వద్దకు వెళ్లి అడిగినా.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. సీకేదిన్నె తహసీల్దార్ గతంలో పనిచేసిన మండలాల్లో కూడా ఇదే విధంగా అవినీతికి పాల్పడుతూ.. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు.
'ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా పట్టించుకోవడంలేదు' - కడప జిల్లాలో ప్రభుత్వ భూములు వార్తలు
కడప జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు.
అఖిలపక్షం నాయకులు