ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు - rajampeta

కడప పట్టణ శివారులోని కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

కడపలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

By

Published : May 23, 2019, 12:07 AM IST

కడపలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

కడప శివారులోని కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రెండు బ్లాకుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 314 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత... ఈవీఎం ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు చేపడతారు. 2 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 1260 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా కమలాపురం, కోడూరు ఫలితాలు... చివరగా పులివెందుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details