ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోటలో.. అందుబాటులోకి సాహస క్రీడల అకాడమీ - గండికోటలో అడ్వెంచర్స్​ అకాడమీ

ప్రఖ్యాత పర్యటక కేంద్రం గండికోటలో సాహస క్రీడల అకాడమీ అందుబాటులోకి వచ్చింది. 104 మందిని మొదటి బ్యాచ్​లో శిక్షణకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

Adventures Academy in Gondicotta
గండికోటలో అడ్వెంచర్స్​ అకాడమీ

By

Published : Jan 18, 2020, 6:25 PM IST

గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్​ అకాడమీ

ప్రఖ్యాత పర్యటక కేంద్రం.. కడప జిల్లాలోని గండికోటలో సాహస క్రీడల అకాడమీ అందుబాటులోకి వచ్చింది. నేలపై మాత్రమే కాకుండా.. నీటిలో, గాలిలో చేసే సాహస క్రీడల్లోనూ ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఇలాంటి వెసులుబాటు ఉన్న అకాడమీ.. దేశంలో ఇదే మొదటిదని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. మొదటి బ్యాచ్​లో శిక్షణకు 104 మందిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే 28 మందికి తర్ఫీదు ఇచ్చామని ఇన్​ఛార్జ్ శేఖర్ బాబు చెప్పారు. తనకు ఎవరెస్ట్​తో పాటు పలు ఇతర శిఖరాలు అధిరోహించిన అనుభవం ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details