కేంద్రంలో భాజపా అధికారం చేపట్టినప్పటి నుంచి కార్మికులు అణచివేతకు గురవుతున్నారని... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ఆరోపించారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో జీవిస్తున్న కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె' - 'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె