ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా రూ.8కోట్లు స్వాధీనం

కడప జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. సరైన ధ్రువ పత్రాలు లేకుండా, జమా పద్దుల లేకుండా 50 వేలకు మించి ఎవరు నగదును తీసుకెళ్ల రాదని ఆయన తెలిపారు.

కడపలో భారీగా పట్టుబడ్డ నగదు,మద్యం

By

Published : Apr 10, 2019, 5:25 AM IST

జిల్లా వ్యాప్తంగా రూ.8కోట్లు స్వాధీనం

కడప జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ తెలిపారు. ఇందులో 4 కోట్ల 27 లక్షల రూపాయల నగదు, 99 లక్షల విలువైన బంగారం, రోల్డ్ గోల్డ్ నగలు, చీరలు పట్టుకున్నారు. ఆదాయపన్ను శాఖ తనిఖీల్లో కోటి 31 లక్షలు అధికారుల చేతికి చిక్కాయి. లక్ష పైన లావాదేవీలు జరిగిన అనుమానాస్పద బ్యాంకు ఖాతాల విలువ 18 కోట్ల 26 లక్షలుగా గుర్తించి వాటిపై పరిశీలన చేస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. సరైన ధ్రువ పత్రాలు లేకుండా, జమా పద్దుల లేకుండా 50 వేలకు మించి ఎవరు నగదును తీసుకెళ్ల రాదని ఆయన తెలిపారు. నగదు, బంగారు, మద్యం స్వాధీనానికి సంబంధించి 140 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నగద,మద్యం, ఇతర వస్తువులు తరిలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details