ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబంలో అల్లుడి చిచ్చు... కలహాలతో ముగ్గురు ఆత్మహత్య - కడప జిల్లాలో కుమార్తెలు ఆత్మహత్య వార్తలు

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురు ప్రాణాల్ని అంతమొందించింది... భవిష్యత్తును భారం అనుకున్నారేమో ఆ కుమార్తెలు తండ్రి మరణించిన వెంటనే తామూ ప్రాణాలు వదిలారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎనకాల వైఎంఆర్ కాలనీలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

3 members committed suicide in kadapa dst father and two daughters
3 members committed suicide in kadapa dst father and two daughters

By

Published : Aug 8, 2020, 11:58 AM IST

Updated : Aug 8, 2020, 1:12 PM IST

మామా, అల్లుళ్ల మధ్య ఏర్పడిన తగాదాలు ముగ్గురు బలవన్మరణానికి కారణమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీకి చెందిన బాబూ రెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే సమయంలో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు తన అల్లుడు సురేష్ కుమార్ రెడ్డే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని తనవు చాలించాడు.

తండ్రి మరణంతో కుంగిపోయిన పెద్ద కుమార్తె శ్వేత, చిన్న కుమార్తె సాయి ఎర్రగుంట్ల-కమలాపురం రైల్వే మార్గంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే?

ఏడాది కిందట బాబురెడ్డి కుమార్తె శ్వేతను ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. గత ఆరు నెలల నుంచి అల్లుడు, కుమార్తె మధ్య వివాదాలు తలెత్తాయి. తరచూ కుమార్తెను అల్లుడు వేధించడంతో తట్టుకోలేక కుమార్తె పుట్టింటికి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత ముదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. అల్లుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక... కుమార్తె ఇంటివద్ద పడుతున్న బాధను చూడలేక తనువు చాలించాలని నిర్ణయం తీసుకున్నాడు బాబూ రెడ్డి.

కలహాలతో తండ్రి... మనస్థాపంతో కుమార్తెలు బలవన్మరణం

తండ్రిమరణాన్ని తట్టుకోలేక కుమార్తెలు ఆత్మహత్య

నిన్న సాయంత్రం సెల్ఫీ వీడియో తీసుకుని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మరణంతో ఇద్దరు కుమార్తెలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం బాబూరెడ్డి భార్య మాత్రమే కుటుంబంలో జీవించి విషాదవార్త తెలిసి కుమిలి పోతున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దకుమార్తె వివాహంలో తీసిన చిత్రం..

ఇదీ చూడండి

ఎక్సైజ్ దాడులు... 827 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం

Last Updated : Aug 8, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details