ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కువైట్ నుంచి రాజంపేటకు 195 మంది రాక - కడప జిల్లా వలస జీవులు

కరోనా ప్రభావంతో ఉపాధి లేక కువైట్ లో ఇబ్బంది పడుతున్న కడప జిల్లా వలస ప్రజలు తిరుగు ప్రయాణం పడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 195 మంది కువైట్ నుంచి రాజంపేటకు చేరుకున్నారు. వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

kadapa district
కువైట్ నుంచి రాజంపేటకు 195 మంది రాక

By

Published : Jul 16, 2020, 6:48 PM IST

ఉపాధి కొల్పోయి కువైట్ లో చిక్కుకుపోయిన కడప జిల్లా వాసులు 195 మంది రాజంపేట చేరుకున్నారు. వారు మొదట విమానంలో విజయవాడకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో రాజంపేట , రైల్వేకోడూరు ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు చేరుకున్నారు. రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ కేంద్రానికి 132 మంది.. రైల్వే కోడూరులోని క్వారంటైన్ కేంద్రానికి 63 మందిని తరలించారు.

వీరికి ఐదు రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే ఫాతిమా కళాశాలకు.. నెగిటివ్ వస్తే 7 రోజుల్లోనే ఇంటికి పంపిస్తామని తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి ఈటీవీ- భారత్ కు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details