రాజుల కాలంలో రాజ్యాలు చూశారు. పాలకుల రాజనీతిని గ్రహించారు. భారతదేశాన్ని ఏలిన పరదేశి తెల్లదొరల పాలనను భరించారు. దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి జరిగిన పోరాట స్ఫూర్తిని గ్రహించారు. కుటుంబానికి నాన్న, తాత, ముత్తాత, ఇలా నాలుగు తరాలకు పెద్దగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంటకు చెందిన ఖాదర్ మొహిద్దీన్ (111).
4 తరాలు చూసిన కురు వృద్ధుడు: 111 ఏళ్ల వయసులో కన్నుమూత
కడప జిల్లాలో 111 ఏళ్ల కురు వృద్ధుడు మరణించాడు. రాయచోటిలోని మేదర వీధిలో మంగళవారం ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
మంచి భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆయన 111 ఏళ్లు జీవించి… తుది శ్వాస విడిచారు. ఖాదర్ మొహిద్దీన్ 1909 జనవరి 19వ తేదీన తూముకుంటలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆయనకు పాడి పంటలపై వ్యామోహం ఎక్కువ. మంచి పంటలు పండించి గ్రామంలో ఆదర్శంగా నిలుస్తూ… వచ్చారు. ఆయన భార్య సాల్మాబీ 73 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఖాదర్ మొహిద్దీన్కు ఐదుగురు కుమారులు, కుమార్తె, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. రాయచోటిలోని మేదర వీధిలో మంగళవారం ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.