ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16వ తేదీ కడపలో శతాబ్ది సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శివా రెడ్డి పేర్కొన్నారు. సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరి కిరణ్ రాష్ట్ర అతిథి గృహం వద్ద ప్రారంభిస్తారని చెప్పారు. సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజలకు.. రెడ్ క్రాస్ సొసైటీ గురించి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
సైకిల్ ర్యాలీతోపాటు రక్తదానం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శివారెడ్డి తెలిపారు. సొసైటీలో యువతను భాగస్వాములు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది యువత రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా ఉన్నారని శివారెడ్డి పేర్కొన్నారు.