ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Harassment: ఇన్​స్టాగ్రామ్​లో వేధింపులు...ఇద్దరు యువకుల అరెస్ట్

ప్రేమించాలంటూ ఇన్​స్టాగ్రామ్ మెసేజ్​ల ద్వారా బాలికను వేధించిన(Harassment) యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడిని తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం, సైబర్ నేరాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇన్​స్టాగ్రామ్​లో వేధింపులు...ఇద్దరు యువకుల అరెస్ట్
ఇన్​స్టాగ్రామ్​లో వేధింపులు...ఇద్దరు యువకుల అరెస్ట్

By

Published : Jun 21, 2021, 4:11 PM IST

ప్రేమించాలంటూ ఓ బాలికను ఇన్​స్టాగ్రామ్ మెసేజ్​ల ద్వారా వేధించిన యువకుడిని, అతడికి సహకరించిన మరో యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన గొలుగూరి జయరాం రెడ్డి.. తన చెల్లెలి స్నేహితురాలైన బాలికను ఇన్​స్టాగ్రామ్​లో మెసేజ్​లు పెట్టి ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు.

ఈ విషయంపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడు జయరాంరెడ్డిని, అతనికి సహకరించిన గొలుగూరి జగన్మోహన్​రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడు బాలిక వాహనానికి జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఆమె కదలికలను గమనిస్తూ వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు సీఐ చైతన్య కృష్ణ తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం, సైబర్ నేరాల చట్టాల కింద కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్​ఫోన్లు వినియోగించే తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు: మంత్రి అనిల్​

ABOUT THE AUTHOR

...view details