ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శృతి మించుతోన్న వైకాపా కార్యకర్తల ఆగడాలు

వైకాపా కార్యకర్తల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు.... దాడులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తల నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.

వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన బాధితులు

By

Published : Jul 7, 2019, 1:49 PM IST


తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇరుపార్టీల కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో విద్యాధరరావు అనే తెలుగుదేశం కార్యకర్తను... కొందరు వైసీపీ కార్యకర్తలు తరచూ వేధింపులకు గురిచేసేవారు. ఈరోజు తన భార్య మీనా పంచాయితీ పంపు వద్దకు వెళ్లి నీళ్లు పడుతుంటే... అక్కడికి కొందరు వైకాపా కార్యకర్తలు వచ్చి ఆమెతో కావాలనే గొడవ పెట్టుకున్నారని బాధితులు వాపోయారు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విద్యాధరరావు....ఎందుకు తమపై దాడి చేస్తున్నారని ప్రశ్నించాడు. ఆయన్నీ కూడా తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారని బాధితులు తెలిపారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details