పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మొత్తం 18రౌండ్లలో లెక్కింపు సాగింది. మొదటి 3రౌండ్లలో వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధిక్యతలో కొనసాగి 3570 ఓట్లు అధికంగా సాధించారు. నాలుగో రౌండ్ నుంచి తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధిక్యత సాధిస్తూ వచ్చారు. ప్రతీరౌండులోనూ తెదేపా ఆధిక్యత సాధించగా 16వ రౌండు ముగిసేసరికి 841 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
17వ రౌండులో సీను రివర్సైంది. వైకాపాకు 1600 ఓట్లు రావటంతో తిరిగి 800 ఓట్ల ఆధిక్యం సాధించింది. 18వ రౌండ్లో నాలుగు పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించి... 1200 ఓట్లకు పైగా ఆధిక్యతతో వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలిచినట్లు ప్రకటించారు. జిల్లాలో 15అసెంబ్లీ స్థానాలలో 13 అసెంబ్లీ స్థానాలను వైకాపా దక్కించుకుంది.