ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా ఓటర్లదే కీలకపాత్ర..! - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 2020

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

women voters are more than male voters in west godavari
women voters are more than male voters in west godavari

By

Published : Feb 16, 2020, 8:10 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా ఓటర్లదే కీలక పాత్ర

పశ్చిమగోదావరి జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఓటర్లలో మగవారి కంటే అతివలు 59,503 మంది ఎక్కువగా ఉన్నట్లు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాలోని గణాంకాలు చెబుతున్నాయి.

ఓటర్లు సంఖ్య
పురుషులు 15,95,016
మహిళలు 16,54,519
మొత్తం 3,249,535‬
మహిళల ఆధిక్యం 59,503

జిల్లావ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఏలూరు నియోజవర్గంలో పురుషుల కంటే 11,586 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. భీమవరంలో పురుషుల కంటే 1073 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మరోవైపు జిల్లాలో 2,65,322 మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా చింతలపూడి నమోదైంది. 1,70,488 ఓటర్లతో తక్కువ ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా భీమవరం నమోదైంది. జిల్లా మొత్తం ఓటర్లలో 4 నుంచి 5 శాతం మహిళా ఓటర్లు అధికంగా ఉండటం వల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఓట్లు కీలకంగా మారనున్నాయి. శుక్రవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెప్పటంతో... ఆశావహులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సంసిద్ధులు అవుతున్నారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ఓటర్ల జాబితా వెల్లడి: అతివలదే ఆధిపత్యం

ABOUT THE AUTHOR

...view details