పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 4 వరకు నిర్వహించిన పరీక్షల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. 2,928 మంది ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 172 మందికి పాజిటివ్ తేలింది. 41,303 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 262మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అవన్ని పాఠశాలలు ప్రారంభించక ముందు వచ్చిన కేసులని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పశ్చిమ గోదావరి ప్రభుత్వ పాఠశాల్లో కరోనా కలకలం...
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం 432 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం