ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొంతెండుతోంది.. దాహం తీర్చండి

ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. ఇదిలావుంటే ఓవర్​హెడ్​ ట్యాంక్​ ద్వారా రంగుమారే నీళ్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నీళ్ల సరఫరా ఆగిపోవటంతో పశ్చిమగోదావరి జిల్లా జట్లపాలెంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

By

Published : May 25, 2019, 3:13 PM IST

'గొంతెండుతోంది.. మంచినీరు ఇవ్వండి'

'గొంతెండుతోంది.. మంచినీరు ఇవ్వండి'

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో తాగునీరు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నిప్పులకక్కే ఎండలకు ఊర్లో ఉన్న మూడు చెరువుల్లో నీరు ఎండిపోయాయి. ట్యాంకు నుంచి సరఫరా చేసే నీళ్ల రంగు మారిపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు నీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. నెలరోజులుగా ఆ నీటినే వాడుకుంటున్న ప్రజలు.. నేడు అవీ రాకపోవటంతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. చెరువులున్నా ఉపయోగం లేదనీ.. పంచాయతీ సరఫరా చేసే నీళ్లు బాగాలేవనీ.. పోనీ వాటితోనే ఎలాగో నెట్టుకొస్తున్నా.. ఇప్పుడు అవీ సరిగ్గా సరఫరా చేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి తమ దాహం తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details