పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి వద్ద గురువారం రాత్రి కలకలం చెలరేగింది. గాలి కలుషితమై దుర్వాసనతో పాటు కళ్ళు మండుతున్నాయని స్థానికులు చేబ్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విశాఖ గ్యాస్ లీక్ అయిన సంఘటన నేపథ్యంలో పోలీసు రెవెన్యూ అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చేబ్రోలులోని సుబ్రమణ్య స్వామి ఆలయ సమీపంలో జరిగిన ఈ ఘటనతో సమీపంలోని దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. తాసిల్దార్ జాన్ రాజు , గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్, ఎస్ఐ వీర్రాజు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఏలూరు ప్రధాన కాలువలో పరిశ్రమ వ్యర్థాలు పోసినట్లు గుర్తించారు. అనంతరం దీనివల్లే దుర్వాసన, కళ్లు మండటం జరిగిందని నిర్ధరించారు. దీంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఈ వ్యర్థాన్ని ఎగువకు ప్రవహించేలా నీటిని జల్లారు.
చేబ్రోలు కళ్లు ఎందుకు మండాయి? - gas leak at chebrolu
పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు జాతీయ రహదారి వద్ద దుర్వాసన, కళ్లు మండటం కలకలం రేపాయి. విశాఖ ఘటనతో స్థానికుల్లో ఒకసారిగా భయం మొదలైంది.
చోబ్రోలులో దుర్వాసన కలకలం