పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో పంచాయతీలో సుమారు 300 కుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన పెను సంచలనంగా మారింది. కక్కల మరణానికి కారణమైన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. అంతేకాక చనిపోయిన కుక్కల కళేబరాలను చెరువులో పెద్ద గొయ్యి తీసి పూడ్చకుండా వదిలేశారు. విశ్వాసానికి మారుపేరుగా పిలుచుకునే కుక్కలు పలు సంఘటనలలో సైతం మానవులకు తోడుగా ఉంటాయని నమ్మకం ఉంటుంది. గుర్తుతెలియని ఆ వ్యక్తుల కర్కశత్వంపై యావత్ జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
ఈ ఘాతుకానికి పంచాయతీ అధికారులే పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి చల్లపల్లి శ్రీలత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూగజీవాలలైన కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి శ్రీలత డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆర్డీవో రచన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపిన ఆర్డీవో జిల్లా కలెక్టర్కు నివేదికను అందించునట్లు తెలిపారు.
ఎవరూ చంపారో తెలీదు: పంచాయతీ కార్యదర్శి