ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచానికి తెలిసేలా.. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు: కేంద్రమంత్రి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజా వార్తలు

ప్రపంచానికి తెలిసేలా అల్లూరు సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి నివసించిన పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో పర్యటించిన ఆయన.. మన్యం వీరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Jun 12, 2022, 8:03 PM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అల్లురి సీతారామరాజు చరిత్ర భావి తరాలతో పాటు.. ప్రపంచానికి తెలిసేలా 125వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో ఆయన పర్యటించారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే మొక్కను నాటారు. మోగల్లు గ్రామంలో అల్లూరి నివసించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అల్లురి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలు ఒక సంవత్సరంపాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జులై 4 న ప్రధాని మోదీ భీమవరం వచ్చి అల్లూరి జయంతి ఉత్సవాలు ప్రారంభిస్తారన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details