ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉండ్రాజవరం మండలంలో అధికారులు బంద్​కు పిలుపు​ - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

ఉండ్రాజవరం మండలంలోని 15 గ్రామాల్లో అధికారులు బంద్​కు పిలుపునిచ్చారు. కరోనా వైరస్​ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాల కేంద్రాలు, మెడికల్​ షాపులు తప్ప మిగిలిన అన్ని దుకాణాలు ముసేశారు.

undarajavaram mandal called for bandh by officers because of increasing corona cases
నిర్మానుషంగా మారిన ఉండ్రాజవరం మండలం

By

Published : Jul 5, 2020, 2:32 PM IST

కరోనా వైరస్​ విజృంభణతో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని 15 గ్రామాల్లో అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు. ఈ కారణంగా మండల గ్రామాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలు తప్ప మిగిలిన అన్ని షాపులు మూతబడ్డాయి. కరోనా పాజిటివ్​ కేసులు అధికంగా నమోదైన గ్రామాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితులు పెరుగుతుండటం వల్ల బంద్​కు పిలుపునిచ్చామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details