ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న వ్యాన్.. ముగ్గురు సజీవ దహనం - west godavari alampuram road accident

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంటపాడు మండల పరిధిలోని అలంపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్​లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమయ్యారు.

చెట్టును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు సజీవ దహనం
చెట్టును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు సజీవ దహనం

By

Published : Apr 17, 2020, 10:05 AM IST

Updated : Apr 17, 2020, 8:08 PM IST

చెట్టును ఢీకొన్న వ్యాన్.. ఇద్దరు సజీవ దహనం

గుంటూరు నుంచి తణుకువైపు స్పిరిట్‌ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌... పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని అలంపురం.. జాతీయ రహదారికి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో మంటలు చెలరేగి... డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి సజీవదహనమయ్యారు. మెుదట ఇద్దరే మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. తర్వాత వైద్యులు వచ్చిన తర్వాత మరో పుర్రెను గుర్తించారు. క్షణాల్లో వాహనం మొత్తం కాలిబూడిదవడంతో బాధితులు తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Apr 17, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details