పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా అధికారులు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోవటం వల్ల ప్రజలు ఆటోలలో ప్రయాణిస్తున్నారు. ఈ సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు రహదారులకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వాహనాలను నియంత్రిస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. నిత్యావసరాలను విక్రయించే దుకాణాలను మినహా అన్నింటిని మూసివేయిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ఉదయం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పోలీసుల చర్యలతో ఉదయం 11 నుంచి రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.
ప్రజలు గడప దాటకుండా పటిష్ఠ చర్యలు - ఏపీలో లాక్‌డౌన్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నారు.
this is the present situation in west godavari