ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూవివాదం: పోలీసులకు, గిరిజనులకు మధ్య ఉద్రిక్తత - west godavari district latest news

భూవివాదం కారణంగా పోలీసులకు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీపీఎం నాయకురాలు చోడెం దుర్గ గాయపడింది.

The tension between the police and the tribe
బుట్టాయగూడెం మండలంలో ఉద్రిక్తత

By

Published : Jun 12, 2020, 11:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం పద్మవారిగూడెంలో భూ వివాదం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, రెవెన్యూ అధికారులను గ్రామంలోకి రానీయకుండా గిరిజనులు మంటలు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంటల్లో కిరోసిన్ పోస్తుండగా పోలీసులు గ్రామంలోకి ఒక్కసారిగా వచ్చేసారు. గిరిజనులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సీపీఎం నాయకురాలు చోడెం దుర్గ మంటల్లో పడటంతో కాళ్ళు చేతులు కాలిపోయాయి. తోపులాటలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. బుట్టాయగూడెం తహసీల్దార్​ను అడ్డుకునేందుకు ఆయన కారు టైర్లలో గాలి తీసేశారు గిరిజనులు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళన చేస్తున్న కొంత మంది గిరిజనులను స్టేషన్ కు తరలించారు. క్షతగాత్రురాలు దుర్గను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి... చికిత్స అందిస్తున్నారు.

బుట్టాయగూడెం మండలంలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details