Eluru Urban Development Authority : ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి రెండు మున్సిపాలిటీలు, 20 మండలాల్లోని 218 గ్రామాలను చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకివీడు, చింతలపూడి మున్సిపాలిటీలతో పాటు భీమడోలు, ఏలూరు, పెదపాడు , పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, జంగారెడ్డి గూడెం, భీమవరం తదితర మండలాల్లోని 218 గ్రామాలను విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెంపు - Eluru Urban Development Authority updates
Eluru Urban Development Authority: ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా రెండు మున్సిపాలిటీలు, 20 మండలాల్లోని 218 గ్రామాలను చేరుస్తూ ప్రకటన విడదల చేసింది.
ap logo
కొత్తగా కలిపిన గ్రామాలతో ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ విస్తీర్ణం 2109 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి