ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేణుగోపాల స్వామి భూముల ఆక్రమణలపై వివాదం..

పశ్చిమ గోదావరి జిల్లాలోని వేణుగోపాల స్వామి ఆలయ భూముల ఆక్రమణలను దేవాదాయశాఖ అధికారులు నిలిపివేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న తమను ఇప్పటికిప్పుడు ఖాలీ చేయమంటే ఎలా అంటూ అధికారులు ప్రశ్నించారు.

వేణుగోపాల స్వామి భూముల ఆక్రమణలపై వివాదం..

By

Published : Sep 26, 2019, 1:46 PM IST

వేణుగోపాల స్వామి భూముల ఆక్రమణలపై వివాదం..
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయంపై స్పందించిన దేవాదాయశాఖ అధికారులు తొలగింపు చర్యలు ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మమ్మల్ని ఇప్పటికి పప్పుడు ఖాలీ చేయమంటే ఎలా అంటూ అధికారులను నిలదీశారు. ఈ మేరకు అధికారులకు, స్థానికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్పందించి ఆలయ భూముల్లో నివసిస్తున్న వారికి కొన్ని రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. హైకోర్టు స్వామి వారి భూ ఆక్రమణలను నిలిపేయమని తాజాగా ఇచ్చిన తీర్పు తెలిసిందే..

ABOUT THE AUTHOR

...view details