ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలనకు సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ బృందం - పోలవరం కాఫర్‌ డ్యామ్ తాజా వార్తలు

నేడు పోలవరం కాఫర్‌ డ్యామ్‌లను సీఎస్​ఎంఆర్​ఎస్ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కేంద్ర నిపుణుల బృందం పరిశీలించి.. కాఫర్‌ డ్యామ్‌లపై గోదావరి వరదల ఉద్ధృతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.

The CSMRS team
The CSMRS team

By

Published : Nov 23, 2020, 10:44 AM IST

సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును నేడు సందర్శించనుంది. మధ్యాహ్నం ఈ బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులను ఈ బృందం పరిశీలించనుంది.

కాపర్ డ్యామ్‌ల నిర్మాణాల పై గోదావరి వరదల ఉధృతి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై వీరు అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులో వీరు పర్యటించనున్నారు. కాపర్ డ్యాంల నిర్మాణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈ బృందం దిశానిర్దేశం చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details