ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు - tanguturi birth anniversary celebrations in tanuku

టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతిని తణుకులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. సొసైటీ రోడ్డులోని పార్క్​ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు.

tanguturi statue opened in tanuku by mla on tanguturi birth anniversary
టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యేలు

By

Published : Aug 23, 2020, 9:55 PM IST

తణుకులో టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.

సొసైటీ రోడ్డులోని పార్క్​ వద్ద ఏర్పాటు చేసిన టంగుటూరి విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి అని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి.. న్యాయవాదిగా ఎంతో పేరు సంపాదించి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details