ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీపి దుకాణాలకు చేదు కష్టాలు - తణుకులో లాక్​డౌన్ కష్టాలు

లాక్ డౌన్ కారణంగా తీపి దుకాణదారులు నష్టాలు చవిచూస్తున్నారు. దుకాణాలు మూసివేసిన కారణంగా.. చాలా మందికి ఉపాధి కరువైంది.

sweet shops
sweet shops

By

Published : Apr 27, 2020, 2:39 PM IST

లాక్‌డౌన్‌ అమలుతో నెల రోజులుగా శుభకార్యాలు నిలిచిపోయాయి. స్వీట్ షాపులు అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు వైశాఖ మాసంలో శుభకార్యాలు ఉన్నా.. లాక్ డౌన్ అమలుతో షాపులు, తీపి పదార్థాలు తయారు చేసే కార్ఖానాలు తెరిచేందుకు అవకాశం లేకపోవడంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో సుమారు 400 మందికి పైగా తీపి దుకాణ దారులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

షాపు స్థాయిని బట్టి ప్రతి దుకాణం కార్ఖానా లో ముగ్గురు నుంచి 20 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. మీరందరూ ఇప్పుడు తాత్కాలికంగా అయినా ఉపాధి కోల్పోయారు. దుకాణ దారులు నెలకు 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా సంపాదించుకునే వారు. ఒకవైపు కార్మికులకు ఉపాధి కల్పించలేక, మరోవైపు ఆదాయం కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details