50 లక్షలకు పందెం.. ఓడిపోయి ఆత్మహత్యాయత్నం! - పశ్చిమగోదావరి
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలుస్తుందని పందెం కట్టాడు ఓ యువకుడు. ఓటమి నేపథ్యంలో పందెం రాయుళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు.
పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో సందీప్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎన్నికల్లో తెదేపా గెలుస్తుందని యాభై లక్షల రూపాయలు పందెం కాశాడు. పార్టీ ఓడిపోయిన పరిస్థితిలో.. పందెం రాయుళ్లకు కొంతమొత్తాన్ని చెల్లించాడు. మిగిలిందీ ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడి ఎదుర్కొన్న కారణంగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న యువకుడిని బంధువులు తణుకులోని శారదా ఆసుపత్రికి తరలించారు. పందెం వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని బంధువులు అంగీకరించడలేదు. పోలీసులు కారణాలపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.