ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి కంటిలో పడిన సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం - sodium hypochlorite fell in person eye

శ్రీనివాసపురంలో పిచికారి చేసేందుకు తీసుకువచ్చిన సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం ఆటోలో నింపే క్రమంలో ఓ వ్యక్తి కన్ను, ఒంటిపై పడింది. స్థానిక వైద్యులు చికిత్స అందించినా బాధితునికి కళ్లు కనిపించలేదు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.

sodium hypochlorite solution fell in person eye
వ్యక్తి కంటిలో పడిన సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం

By

Published : Apr 10, 2020, 5:46 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో జాల శ్రీను అనే వ్యక్తి కంటిలో సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పడింది. జంగారెడ్డిగూడెం మండలంలోని 20 పంచాయతీలకు సంబంధించి ద్రావణాన్ని పంపిణీ చేసేందుకు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి పోలినాటి బాబ్జీ తన ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు ఆటోలో నింపే క్రమంలో జాల శ్రీను బకెట్​తో పోస్తుండగా అతని కన్నుపై, ఒంటిపై పడింది. స్థానికంగా ఉన్న వైద్యులు వెంటనే నీటితో శ్రీను కంటిపై తుడిచారు. అయినా బాధితుడికి కళ్లు కనిపించకపోడవం వల్ల మెరుగైున వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుని కుడి కన్ను కనిపించడం లేదని అతని బంధువులు ఆందోళన చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details