పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవం చేపట్టారు. ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను.. ఇక్కడ అయిదురోజుల పాటు నిర్వహిస్తారు.
తొలుత రథోత్సవం నిర్వహించి.. మరుసటిరోజు స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం చేపడతారు. ఈ ఆలయంలో స్వామివారిని చంద్రుడు ప్రతిష్టించాడని ప్రతీతి. అందుకే స్వామివారిపై చంద్రకళలు కనిపిస్తాయని వినికిడి. ఇక్కడ శివలింగం అమావాస్య నాడు నలుపు రంగులోనూ.. పౌర్ణమికి తెలుపు రంగులో భక్తులకు దర్శనమిస్తుంది.