చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలోని చెరువుకు గండి పడింది. చెరువును ఆనుకొని ఉన్న ఎస్సీ కాలనీలోని నివాసాల మధ్యకు వరద నీరు చేరింది. సుమారు 100 కుటుంబాలకు చెందినవారు నిరాశ్రయులు అయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. స్థానిక నేతలు వారికి సహాయం చేస్తున్నారు.
ఈ క్రమంలో అల్లిపల్లి వద్ద వంతెనపై ద్విచక్రవాహనంపై దాటుతుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు వరదలో గల్లంతు అయ్యాడు. అ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై స్వామి.. స్థానికులు సాయంతో యువకుడిని రక్షించారు. గ్రామస్తులు ఎస్సై, సాహసం చేసిన యువకులను అభినందించారు.