ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు'

లాక్​డౌన్​ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్​రావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దుల్లో బందోబస్తు పెంచినట్లు తెలిపారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

security tighten at ap boarders says eluru range dig kv mohan rao
security tighten at ap boarders says eluru range dig kv mohan rao

By

Published : Apr 4, 2020, 8:24 PM IST

'రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు'

లాక్​డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐడీ కేవీ మోహన్ రావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్​స్టేషన్​ను డీఐజీ సందర్శించారు. స్టేషన్​లో పలు దస్త్రాలు పరిశీలించి పట్టణంలో లాక్​డౌన్ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోసుబొమ్మ కూడలి, తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి, కాకర్ల జంక్షన్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న పికెట్​లను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.

నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. వ్యవసాయ అనుబంధ పనులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలి సూచించారు. లాక్​డౌన్ ఉన్నా చాలాచోట్ల ప్రజలు రహదారులపై తిరుగుతున్నారని ఏలూరు రేంజి పరిధిలో 50 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి:వంట సరకులతో 3 కి.మీ నడిచిన కలెక్టర్​, ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details