పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం
బర్రింకలపాడు సమీపంలో జంగారెడ్డిగూడేనికు చెందిన పాఠశాల బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా బర్రింకలపాడు సమీపంలో జంగారెడ్డిగూడెనికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను తీసుకువచ్చేందుకు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పింది. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేని కారణంగా.. పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.