పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పెనుప్రమాదం తప్పింది. కొవ్వూరు నుంచి పోలవరానికి 20 మంది విద్యార్థులతో వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి గోదావరి గట్టుపైకి జారింది. విద్యార్థులంతా బస్సు నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఉదయం నుంచి వర్షం పడటం వలన మట్టితో ఉన్న గట్టు జారి.. చక్రాలు అదుపు తప్పాయని చోదకుడు తెలిపాడు. అదనపు తరగతలు పేరిట విద్యార్థులను ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాలలోనే ఉంచుతున్నారని... అందుకే రాత్రి సమయంలో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయంటూ తల్లితండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం - students
పోలవరంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కడెమ్మ ఆలయం సమీపంలో అదుపుతప్పి గోదావరి గట్టుపైకి ఎక్కింది.
పాఠశాల బస్సు